ఏపీ: ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులను ఫైనలైజ్ చేసిన గవర్నమెంట్..

frame ఏపీ: ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులను ఫైనలైజ్ చేసిన గవర్నమెంట్..

Suma Kallamadi
రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా అనేక కళాశాలలపై ప్రభావం చూపుతుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలకు ఈ మార్పులను అర్థం చేసుకోవడం చాలా కీలకం.
ఆంధ్రప్రదేశ్‌లోని 210 బి.టెక్, రెండు ఆర్కిటెక్చర్ కాలేజీలకు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఫీజులను ప్రభుత్వం ప్రకటించింది. బీటెక్ కోర్సులకు అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షలు, అత్యల్పంగా రూ.40 వేలు. వీటిలో 114 కాలేజీలు రూ.40 వేలు, ఎనిమిది కాలేజీలు రూ.లక్షకు పైగా వసూలు చేస్తున్నాయి. రెండు ఆర్కిటెక్చర్ కాలేజీలకు ఒక్కోదానికి రూ.35 వేలు ఫీజు. ఈ రుసుము ట్యూషన్, అనుబంధం, ID కార్డ్‌లు, వైద్య సేవలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థుల కార్యకలాపాలను కవర్ చేస్తుంది.
కాలేజీలు అదనపు ఫీజులు వసూలు చేయడానికి అనుమతి లేదు. ఫీజులో వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్ లేదా రీఫండబుల్ ఫీజులు ఉండవు. అదనపు మొత్తాన్ని క్యాపిటేషన్ లేదా విరాళాలుగా వసూలు చేయరాదని ప్రభుత్వం పేర్కొంది.  అలా చేసిన కాలేజీలకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ ఫీజులు పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుకు లోబడి ఉంటాయని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ పేర్కొన్నారు.
గుంటూరులోని ఆర్‌వీఆర్‌, జేసీ, విశాఖలోని గాయత్రి విద్యా పరిషత్‌ విద్యాసంస్థలు, విజయవాడలోని ప్రసాద్‌ వి పొట్లూరి సిద్ధార్థ, భీమవరంలోని ఎస్‌ఆర్‌కెఆర్‌, శ్రీవిష్ణు కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లు అత్యధికంగా రూ.1.05 లక్షలు వసూలు చేస్తున్నాయి. విశాఖలోని జివిపి కళాశాల డిగ్రీ, పీజీ కాలేజీలో రూ.92,400, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో రూ.93,700 వసూలు చేస్తున్నారు.
 ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేవారు ఈ ఫీజులను దృష్టిలో పెట్టుకొని మనీ చెల్లించాల్సి ఉంటుంది వీటి కంటే ఎక్కువ డబ్బులు అడిగే కాలేజీలపై ఫిర్యాదు చేయవచ్చు. మరింత సమాచారం కోసం ఆయా కాలేజీలను కాంటాక్ట్ అవ్వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: