రైల్వే జాబ్ అంటే అదో గౌరవం, భరోసా.. చిన్న ఉద్యోగమైనా సరే రైల్వే వంటి సంస్థలో సంపాదించాలని చాలా మంది కోరుకుంటారు. ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ వచ్చేసింది. ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 2792 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
10వ తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కూడా ఉంటుంది.
ఇక ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం ఖాళీలు- 2792
ఫిట్టర్- 1070
వెల్డర్-547
మెకానిక్ (ఎంవీ)- 9
మెకానిక్ (డీజిల్)- 123బ్లాక్‌స్మిత్- 9
మెషినిస్ట్- 74
కార్పెంటర్ -20
పెయింటర్- 26
లైన్‌మ్యాన్- 49
వైర్‌మ్యాన్- 67
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్- 54
ఎలక్ట్రీషియన్- 593
మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్- 9
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 75
టర్నర్- 67
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 4
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.rrcer.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: