ఫ్రెషర్స్ కోసం “గూగుల్ కొత్త కోర్సులు”...

Bhavannarayana Nch

ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉపయోగించే వారి సంఖ్య కొన్ని కొట్లలో ఉంటుంది..గూగుల్ ఇంటర్నెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు అనే చెప్పాలి..కావాల్సిన సమాచారం పై ఒక్క క్లిక్ చేస్తే చాలు లక్షల సంఖ్యలో సమాచారం మనం ముందు ఉంటుంది...ప్రస్తుతం ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మంచి సాంకేతిక నిపుణులను రూపొందిం చేందుకు గూగుల్‌ సిద్దమైంది. ఐటి రంగంలో ఉన్నతంగా స్థిరపడాలనుకునే వారి కోసం కొన్ని స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించింది...ఇది ఎంతో ప్రత్యేకమైన విధానం..ఐటీ లో స్థిరపదాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం అనే చెప్పాలి ఆ కోర్సుల వివరాలలోకి వెళ్తే.

 

గూగుల్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ ఫండమెంటల్స్‌ కొన్ని కొత్త కోర్సులు మొదలు పెడుతోంది ఈ కోర్సులో టెక్నికల్‌ సపోర్ట్‌ ఫండమెంటల్స్‌పై అవగాహన కల్పిస్తారు...అంతేకాదు ఐటి సపోర్ట్‌ స్పెషలిస్ట్‌ రోల్స్‌ ఎంట్రీ లెవల్‌గా ఈ కోర్సు ఉపయోగపడుతుంది...అయితే ఈ క్రమంలోనే బైనరీ సిస్టమ్‌ పని విధానం. కంప్యూటర్‌ను అసెంబుల్‌ చేయడం...ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఇన్‌స్టాల్‌..ఇంటర్నెట్‌..ఐటీ సాఫ్ట్‌ స్కిల్స్‌ వంటి అంశాలపై విద్యార్ధులకి అవగాహన కలిపిస్తారు.కోర్సు వ్యవధి       వారానికి 8-10 గంటలు రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

 

జనవరి 23, 2018 గూగుల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అండ్‌ యూ: బికమింగ్‌ ఎ పవర్‌ యూజర్‌ సర్టిఫికెట్‌ ఈ కోర్సులో విండోస్‌, లినక్స్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ సంబంధిత అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ కూడా ఇస్తారు. నావిగేట్‌ ద విండోస్‌, లినక్స్‌ ఫైల్‌ స్టిమ్స్‌, సెట్‌ ఆఫ్‌ యూజర్స్‌, గ్రూప్స్‌, పర్మిషన్స్‌, సిస్టమ్‌ ప్రాసెస్‌, సిస్టమ్‌ లాగ్న్‌, ట్రబుల్‌ ఘాట్‌ వంటి అంశాలను ఈ కోర్సులో బోధిస్తారు. కోర్సు వ్యవధి : వారానికి 8-10 గంటలు రిజిస్ట్రేషన్‌ ప్రారంభం :

 

జనవరి 23, 2018 గూగుల్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ఐటి ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ సర్వీసెస్‌ కంప్యూటర్‌ సిస్టమ్స్‌ను మెయిం టెయిన్‌ చేసే సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి ఎదురయ్యే సమస్యలు, పరిష్కారాలు తదితరాలపై సంపూర్ణ అవగాహన కల్పించేలా ఈ కోర్సును రూపొందించారు. ఇందులో హార్ట్‌వేర్‌, వెండర్స్‌, కామన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డైరెక్టరీ సర్వీసెస్‌, బ్యాకప్‌, రికవరీ వంటి అంశాలను బోధిస్తారు...కోర్సు వ్యవధి : వారానికి 8-10 గంటలు రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

 

 జనరి 23, 2018 కోర్సుఎరా ద్వారా ఆన్‌లైన్‌లో గూగుల్‌ ఈ కోర్సులను కోర్స్‌ ఏరా ద్వారా ఆన్‌లైన్‌లో అందిస్తుంది. ఈ కోర్సులను ఐటీ రంగంలో ప్రవేశించాలనుకునే ఫ్రెషర్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. గూగుల్‌ ఐటి ఆటోమేషన్‌ ఐటి రంగంలో ఆటోమేషన్‌ మేనేజ్‌మెంట్‌ కన్సెప్ట్‌కు సంబంధించిన అంశాల పై అవగాహన కల్పించేందుకు ఈ కోర్సును రూపొందించారు..ఈ కోర్సులో రూబీ లాంగ్వేజ్‌, బేసిక్‌ ఆటోమేషన్‌ స్క్రిప్ట్‌, రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, వెర్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ద్వారా కోడ్‌ను మేనేజ్‌ చేయడం తదితర అంశాలను బోధిస్తారు బేసిక్‌ నెట్‌వర్కింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ టాస్క్‌, వంటి వాటిపై అవగా హన ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్సు వ్యవధి : వారానికి 8-10 గంటలు రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

 

జనవరి 23, 2018 గూగుల్‌ ఐటి సెక్యూరిటీ వివిధ రకాల ఐటి సెక్యూరిటీ కన్సెప్ట్స్‌పై ఈ కోర్సులో అవగాహన కల్పి స్తారు. ఇందులో ఎన్‌క్రిప్షన్‌ అల్గారిథమ్స్‌, టెక్నిక్స్‌, లిమిటేషన్స్‌, ఆథరైజేషన్‌ తదితర అంశాలను బోధిస్తారు. కోర్సు వ్యవధి : వారానికి 8-10 గంటలు రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: