“ 10 పాస్" తో ఇండియన్ ఆయిల్” లో ఉద్యోగాలు..

Bhavannarayana Nch

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) సదరన్ రీజియన్‌లో 58 జూనియర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది...చాలా నెలల తరువాత మళ్ళీ ఇండియన్ ఆయిల్ లో ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకి శుభవార్త అందించింది..అయితే ఈ ఉద్యోగాలకి పదవ తరగతి ఉత్తీర్ణత మరియు ఐటీఐ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుందని తెలిపారు..


ఖాళీల వివరాలు..

జూనియర్ ఆపరేటర్ గ్రేడ్-1:   25 పోస్టులు.

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణత, ఒక ఏడాది అనుభవం ఉండాలి.

జూనియర్ ఆపరేటర్ (ఏవియేషన్) గ్రేడ్-1:  33 పోస్టులు.

అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లెసైన్స్, ఒక ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: 18-26 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక:  రాతపరీక్ష, స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ (ఎస్‌పీపీటీ) ద్వారా.

రాతపరీక్ష తేదీ: జూలై 15, 2018

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: రూ.150

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 26, 2018

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 16, 2018

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.iocl.com


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: