కర్నూల్ జిల్లాలో “డీఎంహెచ్ఓ” లో... “అవుట్ సోర్సింగ్ ” ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖా అధికారిక కార్యాలయం అయిన డీఎంహెచ్ఓ లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ మండలాల్లో 79 సెకండ్ ఏఎన్ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...ఈ పోస్టులకి సంభందించిన అర్హతలు..విధ్యానుభవం , జత చేయవలసిన సర్టిఫికెట్ల వివరాలు అన్ని క్రింద నోటిఫికేషన్ లో వివరంగా తెలుపబడ్డాయి..
అర్హత: పదో తరగతితో పాటు 18 నెలల ఎంపీహెచ్డబ్ల్యూ
(ఎఫ్) ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదా సంబంధిత సబ్జెక్టులో ఇంటర్ ఓకేషనల్ కోర్సుతో
పాటు అనుభవం ఉండాలి.
వయసు: 2018 ఆగస్టు 1 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట సడలింపు
ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో.
దరఖాస్తు ఫీజు: రూ.250(ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫీజు లేదు).
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 4, 2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: https://www.kurnool.ap.gov.in/