"SSB లో కానిస్టేబుల్"..ఉద్యోగాలు...వీరికి మాత్రమే..!!!
భారత
ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకి చెందిన న్యూఢిల్లీ లోని ససస్త్ర సీమాబల్ లో కానిస్టేబుల్
ఉద్యోగాలకి నియామక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో
మాత్రమే భర్తీ చేయనున్నారు. మొత్తం 150 ఉద్యోగాలని భర్తీ చేయనున్నట్లుగా
నోటిఫికేషన్ లో తెలిపారు. పోస్టుల వివరాలలోకి వెళ్తే..
జనరల్ డ్యూటీ
కానిస్టేబుల్ గ్రూప్ సీ : 150.
అర్హత: మెట్రిక్యులేషన్
తత్సమాన ఉత్తీర్ణత , 2017 జనవరి 1 తరువాత దేశం తరుపున అంతర్జాతీయ స్థాయి
క్రీడల్లో పాల్గొనడం లేదా గత ఒలంపిక్ గేమ్స్ , ప్రపంచ కప్ , ఆసియన్ గేమ్స్ లో
పాల్గొని ఉన్నవాళ్ళు అర్హులు.
వయసు: 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: బయోమెట్రిక్ ఎగ్జామినేషన్, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్, ఫీల్డ్ ట్రయల్, ఫిజికల్స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ల ద్వారా
ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు
చేసుకోవాలి.
దరఖాస్తు గడువు: ఎంప్లాయ్మెంట్ న్యూస్ (జులై 13-19)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ssb.nic.in