బంగారం: ప‌రుగులు పెడుతున్న బంగారం ధ‌ర‌.. దిగొచ్చిన వెండి..!!

Kavya Nekkanti

బంగారం ధ‌ర‌లు ఏ రోజు పెరుగుతాయో.. ఏ రోజు త‌గ్గుతాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఒక‌రోజు భారీగా దిగొస్తుంటే.. మ‌రోరోజు భారీగా పెర‌గ‌డ‌మో, స్వ‌ల్పంగా పెర‌గ‌డ‌మో జ‌రుగుతుంటుంది. ఈ క్ర‌మంలోనే నేడు బంగారం ధ‌ర పైపైకి ప‌రుగులు పెట్టింది. వెండి మాత్రం దిగొచ్చిన కాస్త ఊర‌ట‌నిచ్చింది. అయితే బంగారం ధర పైకి కదలడం ఇది వరుసగా ఏడో రోజు కావడం గమనార్హం. బంగారం ధ‌రిలా కొండెక్కి కూర్చుంటే ప్ర‌జ‌లు కొనుగోలు చేయ‌డానికి జంకుతున్నారు.

 

అయిన‌ప్ప‌టికీ క‌రోనా జోరులా.. బంగారం ధ‌ర‌లు కూడా పెరుగుతూ వ‌స్తున్నాయి. ఇక నేడు బంగారం, వెండి ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పైపైకి క‌దిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెర‌గడంతో ప్ర‌స్తుతం బంగారం ధ‌ర‌ రూ.45,760కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.41,960కు ఎగసింది.

 

ఇక బంగారం ధరలు పెరుగుదల కనిపించగా , వెండి ధరలు మాత్రం ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 60 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 41,850 రూపాయల వద్దకు నిలిచింది. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: