పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు..!
దేశీయ మార్కెట్ లో పసిడి ధర పెరగగా వెండి ధర మాత్రం భారీగా పతనమైంది. ఇక నేడు దేశీయ మార్కెట్లో కేజీ వెండి రూ. 3050 తగ్గగా రూ.63000 కు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు పెరగడానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరియు అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల వల్ల పసిడి పరుగుకు దోహదపడుతున్నాయని, బంగారం ధర పెరిగితే మాత్రం వెండి ధర తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు.
భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర పైపైకి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరగడంతో ధర రూ.53,000కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరగడంతో రూ.51,800కి ఎగిసింది. ఇక కేజీ వెండి ధర మాత్రం భారీగా తగ్గింది 10 గ్రాముల వెండిధర రూ.3050 తగ్గడంతో రూ.63,000 కి క్షీణించింది.