ఆగని బంగారు, వెండి ధరల జోరు...!
ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఓన్స్ స్పాట్ బంగారం ధర 0.3 శాతం పెరిగి 2,068.32 డాలర్లకు చేరుకుంది. ఓ సమయంలో 2,072.50 డాలర్లకు కూడా చేరింది. అలాగే వెండి ఔన్స్ ధర ఏకంగా 2.6 శాతం పెరిగి 30 డాలర్ల సమీపంలో 29.68 డాలర్ల వద్ద ముగిసింది. తాజాగా నేడు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) లో గోల్డ్ ఫీచర్స్ పది గ్రాముల బంగారం ధర రూ. 300 రూపాయలు పెరిగి రూ. 56,143 కు చేరుకుంది. అలాగే వెండి ధర కూడా కేజీ రూ. 750 రూపాయలు పెరిగి రూ. 77,802 కు చేరింది. ఇక ఈ ఏడాది మన దేశంలో బంగారు ధరలు ఏకంగా 44 శాతం మేర ఎగిసాయి. వెండి ధర దాదాపు డబుల్ అయిందని చెప్పవచ్చు.
ఇక తాజాగా హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరల విషయానికొస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 800 పెరిగి రూ. 59,130 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 690 పెరిగి రూ. 54,200 కు చేరుకుంది. ఇక మరోవైపు వెండి ధర విషయానికి వస్తే... కేజీ వెండి ఏకంగా రూ. 3010 రూపాయలు పెరిగి ధర ఏకంగా రూ. 76,510 కి చేరుకుంది. రానురాను బీదవారు, మధ్యతరగతి ప్రజలు బంగారం వెండి కొనాలంటే ఇక కష్టమే.