భారీగా తగ్గినా పసిడి, వెండి ధరలు...!
గత 16 రోజులుగా బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో పెరుగుతూ వస్తున్నాయి. 24 గ్రా. బంగారం శుక్రవారం ఢిల్లీలో ఆల్ టైమ్ గరిష్టం రూ.57,008కి చేరింది. అలాగే వెండి కిలో ధర రూ.77,840 పలికింది. కరోనా కేసులు పెరగడం అలాగే, ఆర్థిక అనిశ్చితితో ఇన్వెస్టర్లు పసిడిలో పెట్టుబడులకు మొగ్గు చూపడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గరిష్టస్థాయి లో లాభపడిందని అర్ధమవుతుంది. అయితే మరి కొన్నిరోజులు బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఇన్వెస్టర్లు మాత్రమే బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. అయితే రిటైల్ మార్కెట్లలో మాత్రం బయట బంగారానికి డిమాండ్ బాగా పడిపోయింది. ఇందుకు ప్రధాన కారణాలు పెరుగుతున్న ధరలు, ప్రజల చేతిలో నగదు లేకపోవడమే ప్రధాన కారణాలు. అయితే కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్నవారు కూడా... ప్రస్తుతం ధరలను చూసి వెనుకంజ వేసే పరిస్థితి. దీంతో రిటైల్ మార్కెట్ లేకుండా పోయింది. ఇక తాజాగా హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రా. ధర రూ. 440 నష్టపోయి రూ. 58,690 వద్ద ముగిసింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రా. ధర రూ. 400 నష్టపోయి రూ. 53,800 వద్ద ముగిసింది. ఇక మరోవైపు ఒక కిలో వెండి ధర రూ. 2310 నష్టపోయి రూ. 74,200 వద్ద ముగిసింది.