భారీగా తగ్గినా బంగారం, కానీ వెండి మాత్రం...!?
ఇక గత నాలుగు రోజుల్లో బంగారం రూ.4000 కంటే ఎక్కువగా నష్ట పోయింది. ఇక కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ను తయారు చేసినట్లు 4 రోజుల క్రితం రష్యా ప్రకటించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో, చివరకు పసిడి పై దాని ప్రభావం పడి ధర తగ్గు ముఖం పడింది. ఇక మరి కొన్ని రోజులు బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగి ఆపై నిలకడగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. కరోనా వైరస్ తో పాటు ఆర్థిక అనిశ్చితి, అగ్ర దేశాల వాణిజ్య యుద్ధం బంగారంపై ప్రభావం చూపనున్నాయి. ఇక 2020 సంవత్సరం మోదలైనప్పటి నుండి 30 శాతానికి పైగా ధరలు పెరిగి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి ధరలు.
ఇక తాజాగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్స్ 10 గ్రా. ధర రూ. 110 పెరిగి రూ. 55650 కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్స్ 10 గ్రా. ధర రూ. 110 పెరిగి రూ. 51000 కు చేరుకుంది. ఇక మరోవైపు వెండి కేజీ వెండి ధర రూ. 1050 పెరిగి రూ. 68,000 కు చేరుకుంది.