స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గుతున్న వెండి ధర..!

Suma Kallamadi
దేశీయ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ వస్తుంది. గత పద్నాలుగు రోజులుగా ధరలు స్వల్పంగా తగ్గిన మళ్ళి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా కొనసాగుతోంది. గురువారం నాటికి 24 క్యారెట్ల పసిడి ధరరూ.10 పెరగడంతో ధర రూ.54,080కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.49,600కి చేరింది.

గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతున్నాయి. ధర సెప్టెంబర్ 4-20వ తేదీ వరకూ స్వల్పంగా పెరిగింది. నిన్న బంగారం ధర భారీ స్థాయిలో పెరిగుతుంది. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,080, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,600కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,500కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,490 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.51,500, 22 క్యారెట్ల ధర రూ.49,140కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,620. 24 క్యారెట్ల ధర రూ.51,950 గా ఉంది.

దేశీయ మార్కెట్ లో పసిడి ధర పెరిగినా వెండి ధర తగ్గుతూ వస్తుంది. మార్కెట్ కేజీ వెండి ధర రూ.67,800కి చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో పసిడి ధర పెరుగుతూ వచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.54,880కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.50.370కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.67,800గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: