భారీగా తగ్గిన వెండి.. స్వల్పంగా పెరుగుతున్న బంగారం !

Suma Kallamadi
దేశీయ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ వచ్చినా నిన్నటి రోజు భారీగా తగ్గి మళ్లీ స్వల్పంగా కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా ధరలు స్వల్పంగా పెరిగి.. నిన్నటి రోజు భారీగా తగ్గి స్థిరంగా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా కొనసాగుతోంది. బుధవారం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 పెరగడంతో ధర రూ.53,240కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.48,810కి చేరింది.

గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,240, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,810కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,640కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,640 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.53,430, 22 క్యారెట్ల ధర రూ.48,060కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,010. 24 క్యారెట్ల ధర రూ.51,640 గా ఉంది.

దేశీయ మార్కెట్ లో పసిడి ధర పెరిగినా వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. మార్కెట్ కేజీ వెండి ధర రూ.1000 తగ్గడంతో ధర రూ.59,600కి చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో పసిడి ధర పెరుగుతూ వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.54,010కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.49.510కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధరలో రూ.1000 తగ్గడంతో ధర రూ.59,600గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: