స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. అదేబాటలో వెండి..!

Suma Kallamadi
దేశీయ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నిన్నటి రోజు అమాంతం తగ్గిన బంగారం ధర ఈ రోజు స్వల్పంగా పెరుగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. గురువారం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50 పెరగడంతో ధర రూ.52,820కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరగడంతో రూ.48,420కి చేరింది.

గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గతూ వచ్చి స్వల్పంగా పెరుగుతుంది. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,820, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ..48,420కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,500 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.52,070, 22 క్యారెట్ల ధర రూ.47,730కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,950. 24 క్యారెట్ల ధర రూ.51,220 గా ఉంది.

దేశీయ మార్కెట్ లో పసిడి ధర స్వల్పంగా కొనసాగినా వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. గత కొంత కాలంగా స్థిరంగా కొనసాగుతూ తగ్గతూ వచ్చి ధర భారీగా పెరిగింది. దేశీయ మార్కెట్ కేజీ వెండి ధర రూ.400 పెరగడంతో ధర రూ.61,400కు చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,650కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరగడంతో రూ.49,200కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.400 పెరగడంతో ధర రూ.61,400కు చేరింది. గత కొంత కాలంగా స్థిరంగా కొనసాగిన వెండి ధర ప్రస్తుతం భారీగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: