పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
నిన్నటి వరకు చుక్కలు చూపిస్తున్న రేట్లు ఈరోజు ఉపశమనం కలిగిస్తున్నాయి..అందుకు కారణం కూడా ఉంది. కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుందని ప్రకటించడమే కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.కరోనా వైరస్ వ్యాక్సి్న్ 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని ఫైజర్ పేర్కొంది. దీంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఫైజర్ కంపెనీ.. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కంపెనీతో కలిసి కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే... ఈ మేరకు బంగారం రేట్లతో పాటుగా ఇతర వాణిజ్య వ్యాపార సంస్థలకు సంబందించిన వస్తువులకు డిమాండ్ కూడా తగ్గడంతో అన్నీ రేట్లు దిగొస్తున్నాయి..
నిన్నటి రేట్లు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.830 పెరుగుదలతో రూ.52,380కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.770 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,020కు పెరిగింది.. ఈరోజు చూస్తే ..ధర దాదాపు 5 శాతం పతనమైంది. 10 గ్రాముల బంగారం ధర రూ.2,500 తగ్గుదలతో రూ.49,659కు పడిపయింది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. 22 క్యారెట్ల రేటు 45,560 కి పడిపోయింది. వెండి ధర ఏకంగా 6 శాతం కుప్పకూలింది. వెండి ధర కేజీకి రూ.4 వేల తగ్గుదలతో రూ.61,384కు క్షీణించింది. మరి రేపటికి ఈ రేట్లు ఎలా ఉంటాయో చూడాలి..