ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..!
బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధర పరుగులు పెట్టడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర పెరిగింది.. హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పడిపోయింది. దీంతో రేటు రూ.45,640కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 తగ్గుదలతో రూ.41,840కు క్షీణించింది.
బంగారం ధరల పై వెండి ధరలు ఆధారపడి ఉన్నాయి.వెండి ధర కేజీకి ఏకంగా రూ.200 పడిపోయింది. దీంతో రేటు రూ.70,500కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1727 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం దిగొచ్చింది. ఔన్స్‌కు 0.71 శాతం తగ్గుదలతో 26.05 డాలర్లకు తగ్గింది.. ఉగాదికి ఎలా ఉంటాయో చూడాలి.. ఎంత తగ్గిన, పెరిగిన కూడా మహిళలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..