స్థిరంగా కొనసాగుతున్న పసిడి.. తగ్గిన వెండి..!
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,090 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 కు చేరింది. బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. నిన్న కాస్త కిందకు దిగి వచ్చిన వెండి నేడు వెల వెల బోయింది. కిలో వెండి ధర రూ. 300మేర తగ్గి రూ. 69,700 వద్ద కొనసాగుతోంది.. పరిశ్రమలలో తయారు దారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ఇప్పుడు తగ్గాయని అంటున్నారు.
ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు. బంగారం ధర ఔన్స్‌కు 0.87 శాతం పెరుగుదలతో 1730 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 2.03 శాతం పెరుగుదలతో 25.03 డాలర్లకు చేరింది. బంగారం ధరల పై ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు లాంటి పలు అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపిస్తున్నాయి.. రేపు బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..