మగువలకు గుడ్ న్యూస్.. నేడు బంగారం,వెండి ధరలు ఇలా..!

Satvika
అక్షయ తృతీయ వచ్చిందంటే చాలా మంది రకరకాల నగలను కొనుక్కొని అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తే అన్నీ శుభాలు కలుగుతాయి.. లక్ష్మీ దేవి ఇంట్లోనే తిష్ఠ వేస్తుందని అంటారు..  ఈరోజు బంగారం ధరలు నిలకడగానే ఉన్నాయి.. ఇది నిజంగానే మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. పసిడిధరలో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. బంగారం ధరలు నిలకడగానే ఉన్నాయి. నిన్న దిగొచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగానే ఉండటం గమనార్హం. 


అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి రేట్లు స్థిరంగా ఉన్నాయి.. హైదరాబాద్ మార్కెట్‌ లో శుక్రవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.48,560 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగానే ఉంది. దీంతో రేటు రూ.44,500 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది... దీంతో ఈరోజు కొనుగోళ్లు కూడా భారీగా పెరుగుతున్నాయి.. లాక్ డౌన్ కారణంగా మహిళలు ఉదయం నుంచే బారులు తీరారు.. 


ఇక వెండి  ధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే నేటి మార్కెట్లో ధరలు మాత్రం పైకి కదిలాయి..ఈరోజు ఏకంగా రూ..100 పైకి కదిలింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,000 కు ఎగసింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌ లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం ధర ఔన్స్‌కు 0.11 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1826 డాలర్ల కు ఎగసింది.వెండి ధర ఔన్స్‌కు 0.26 శాతం పెరుగుదల తో 27.13 డాలర్లకు చేరింది. ఈరోజు స్థిరంగా కొనసాగుతున్న ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి.. బంగారం ధరల పై ఎన్నో అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: