పైకి కదిలిన పసిడి ధర.. భారీగా తగ్గిన వెండి..!!
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 ఉంది. విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 వద్ద ఉంది. సోమవారం దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు నిలకడ గా ఉంటే హైదరాబాద్ లో మాత్రం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.4,600 తగ్గింది. ప్రస్తుతం రూ.71,600 ఉంది. ఇక విజయవాడలో రూ.71,600 ఉంది..
బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయం లో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..పెళ్ళిళ్ళు సీజన్ కావడం తో ధరలు కొద్దిగా పెరుగుతున్నాయి.. జూన్ లో అయిన ధరలు కిందకు వస్తా యో చూడాలి..