పసిడి ప్రియులకు భారీ ఊరట.. అదే దారిలో వెండి..!!

Satvika
పసిడి ప్రియులకు భారీ ఊరట.. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతోంది. ఈరోజు భారీగా పసిడి ధరలు పడి పోయాయి.. ఎన్నడూ లేని విధంగా దేశంలో బంగారం ధరలు కిందకు దిగి వచ్చాయి. ఈరోజు ఏకంగా 700 తగ్గింది. ఇది నిజంగానే మహిళల కు కళ్ళు చెదిరె గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఆదివారం ధరలు కిందకు రావడం తో మార్కెట్ లో కొనుగొల్లు ఎక్కువ అయ్యాయి.


దేశంలో బంగారం ధరకు బ్రేకులు పడ్డాయి..నిన్నటి ధర తో పోలిస్తే నేటి మార్కెట్ లో ధరలు ఊరట కలిగిస్తున్నాయి.. ఇక విదేశీ మార్కెట్ లోకూడా ధరలు పరుగులు పెట్టాయి.. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,649 ఉంది. ఇకపోతే వెండి ధరలు మాత్రం నేల చూపులు చూస్తున్నాయి. ఈరోజు వెండి ధరలు అమాంతం కిందకు దిగొచ్చింది.. ఒక వైపు బంగారం ధరలు పరుగులు పెడుతుంటే వెండి మాత్రం దిగి వచ్చింది.


ఆదివారం మాత్రం వెండి తగ్గుముఖం పట్టింది. మార్కెట్లో రూ.2000 డౌన్ అయింది వెండి ధర. దీంతో కేజీ వెండి ధర రూ.75,500కు ట్రేడ్ అవుతోంది. ఇక బంగారం వెండి వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇకపోతే హైదరాబాద్‌ లో కిలో వెండి ధర రూ.75,500 ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. మరి రేపు మార్కెట్  లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: