ఈ రోజు మగువలకు ఎగిరిగంతేసే న్యూస్.. బంగారం కొనాలని అనుకునేవారికి ఈరోజు ధరలు ఊరటను కలిగిస్తున్నాయి.. బంగారం ధరలు మళ్ళీ తగ్గు ముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులు గా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. కరోనా కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.. ఈరోజు మాత్రం మార్కెట్ లో భారీగా ధరలు పడి పోయాయి.. ఎన్నడూ లేని విధంగా దేశంలో బంగారం ధరలు కిందకు దిగి వచ్చాయి.. వెండి ధరలు కూడా భారీగా కిందకు దిగివచ్చాయి..
హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం బంగారం ధరలను చూస్తె.. బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 పడిపోయింది. దీంతో పసిడి రేటు రూ.49,640కు క్షీణించింది. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.240 తగ్గుదల తో రూ.45,500 కి పడిపోయింది.. గత మూడు రోజులు నుంచి పసిడి ధరలు తగ్గుతూవస్తున్నాయి..
బంగారం తగ్గితే .. నేడు మార్కెట్ లో వెండి ధరలు కూడా కిందకు దిగివచ్చాయి.. వెండి రేటు ఈరోజు భారీగానే దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. రూ.800 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.76,500 కు పడిపోయింది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కళ్ళు చెదిరే వార్త అని చెప్పవచ్చు.. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. 0.09 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్ కు 1867 డాలర్ల కు చేరింది. వెండి రేటు మాత్రం పడిపోయింది. ఔన్స్‌కు 0.25 శాతం తగ్గుదల తో 27.97 డాలర్ల కు క్షీణించింది.. బంగారం ధరల పై చాలా అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..