గోల్డ్: పరుగులు పెడుతున్న పుత్తడి..
ముఖ్యంగా భారతదేశంలో బంగారంకి ఉన్న విలువ మరి ఏ వస్తువుకు లేదు. ముఖ్యంగా మగువలు ఇష్టపడేది ఈ బంగారం మాత్రమే. ఇక బంగారం తర్వాతనే ఏదైనా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ బంగారు ఆభరణాలు ధరించడం కొందరు అదృష్టంగా కూడా భావిస్తూ వుంటారు.ముఖ్యంగా పండుగలు, ఏదైనా సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ బంగారు ఆభరణాలను కొనుక్కోవడానికి ఇష్టపడతారు. మరికొంతమంది ఈ బంగారు ఆభరణాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణంగా బంగారు ధరలలో రోజు రోజుకు మార్పు వస్తూనే ఉంటుంది. నిన్నటివరకు బంగారు ధర తగ్గుముఖం పట్టి, నేడు గ్రామ్ పై 45 రూపాయల చొప్పున పెరగడంతో 10 గ్రాములకు 450 రూపాయలు పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. అయితే ఈ రోజు అనగా జూలై 2 2021 తేదీ న బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
22 క్యారెట్ విలువగల ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారు ముంబైలో నిన్నటితో ఒక గ్రాము నలభై ఐదు రూపాయల మేర పెరిగి,10 గ్రాముల ధర రూ.46,190కి పైకి ఎగిసింది. ఇక పెట్టుబడి పెట్టే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.47,190 . ఇక రోజు రోజుకు బంగారు ధరలు పెరిగిపోవడంతో పుత్తడి ప్రియులు షాక్ కి గురవుతున్నారని చెప్పవచ్చు.
వివిధ ప్రాంతాల వారీగా ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చెన్నై: 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.44,430. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రూ.48,470.
2. ముంబై : 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,190,
24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.47,190.
3. ఢిల్లీ : 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150,
24 క్యారెట్ల బంగారం ధర రూ.50,150.
4. బెంగళూర్ : 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000,
24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000.
5. విజయవాడ: 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000,
24 క్యారెట్ల బంగారం రూ.48,000.
6. హైదరాబాద్:22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000,
24 క్యారెట్ల బంగారం రూ.48,000.
సిల్వర్ ధర గ్రామ పైన 1.10 పెరిగి 10 గ్రాముల ధర రూ.687 .
ఒక కేజీ సిల్వర్ ధర రూ.68,700 వరకు పెరిగింది.