బంగారం కొంటున్నారా ? అయితే హాల్మార్క్ గురించి తెలుసా ?
అయితే బంగారం కొనుగోలుదారులు చాలా విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. నాణ్యత విషయంలో అజాగ్రత్తగా ఉన్నారంటే కేటుగాళ్లు చేతిలో మోసపోవాల్సి ఉంటుంది. బంగారం నాణ్యతను ఎలా చూడాలో తెలుసా ? హాల్మార్క్ ద్వారా అది నాణ్యమైన బంగారం అని గుర్తించొచ్చు.
అసలు హాల్ మార్క్ అంటే ఏమిటి ? అంటే... హాల్మార్క్ బంగారం అనేది ధృవీకరించబడిన బంగారం. అంటే బంగారం నాణ్యత తనిఖీ, హామీని హాల్మార్కింగ్ అని పిలుస్తారు. భారత ప్రభుత్వం కింద ఒక ఏజెన్సీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అని పిలువబడుతుంది. బంగారు వస్తువు స్వచ్ఛతను, క్వాలిటీని ధృవీకరించడానికి ఈ హాల్మార్కింగ్ ప్రక్రియను నిర్వహిస్తుంది. బంగారం కొనేముందు ఈ హాల్ మార్క్ ను చేసే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
బంగారం స్వచ్ఛతపై ప్రామాణికత స్టాంప్ ఉంది. హాల్మార్కింగ్ అంటే బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ సర్టిఫైడ్ సెంటర్లు బంగారం స్వచ్ఛతపై మీకు భరోసా ఇస్తాయి. ప్రస్తుతం దేశంలో హాల్మార్కింగ్ కేంద్రాలు చాలా తక్కువ. ఈ కేంద్రాలను పెంచాలనే డిమాండ్ కొనసాగుతోంది. బంగారు హాల్మార్కింగ్ చేసేటప్పుడు చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే హాల్మార్కింగ్ సెంటర్ లోగో, హాల్మార్కింగ్ జరిగిన సంవత్సరం. ఈ హాల్మార్కింగ్ కేంద్రాలన్నీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కిందకు వస్తాయి. ఆ నాణ్యతలో కూడా వివిధ రకాల తేడాలు ఉంటాయి. బిఐఎస్ 916, కేడిఎం వంటివి. వాటిని కూడా ప్రత్యేకంగా గమనించాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు కొనే బంగారంపై హాల్ మార్క్ గుర్తు ఉందో లేదో చూసి కొనండి.