అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాలను ఎలా పర్యవేక్షిస్తారు ?
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ క్రమం తప్పకుండా అస్సేయింగ్, హాల్ మార్కింగ్ కేంద్రాల పర్యవేక్షణ ఆడిట్‌లను నిర్వహిస్తుంది. సాధారణంగా ఈ కేంద్రాలు బంగారు ఆభరణాలు, వాటి స్వచ్ఛత, చక్కదనం పరీక్ష ను నిర్వహిస్తాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో వారి రిజిస్ట్రేషన్ ను పునరుద్ధరించేటప్పుడు ఈ అస్సేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ కేంద్రాల పని తీరు పరిగణించబడుతుంది. BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) చట్టంలో పేర్కొన్న ప్రమాణాల ప్రకారం పథకం విశ్వసనీయత నిర్వహించలేదని తేలితే BIS అటువంటి పరీక్ష, హాల్ మార్కింగ్ కేంద్రాలపై అవసరమైన చర్యలు తీసుకోవచ్చు.
హాల్ మార్కింగ్ ఉన్న నగలను కొనడం వల్ల మనం కొన్నది స్వచ్ఛమైన బంగారమా ? లేదా అన్నది తెలుస్తుంది. కాబట్టి ఈసారి కొనేటప్పుడు ఖచ్చితంగా బంగారంపై హాల్ మార్కింగ్ ఉండేలా చూసుకోండి.
ఇక నేటి బంగారం ధర విషయానికి వస్తే... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వంద రూపాయలు తగ్గి రూ.44,000లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 తగ్గి రూ.48,000 లకు చేరుకుంది