ఈ దీపావళికి బంగారం కొంటున్నారా ? ఈ ముఖ్యమైన అంశం మర్చిపోవద్దు

Vimalatha
గత రెండ్రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు షాకిచ్చాయి. అక్టోబర్ 29న దీపావళికి ముందు భారతీయ బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. నేడు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 44,950/10 గ్రాములు మరియు 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 49,050/10 గ్రాములు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో బంగారం ధరలు రూ. 200/10 గ్రాములు పెరిగింది. పూణె, కోల్‌కతా వంటి నగరాల్లో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి.
కామిక్స్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ ఈరోజు 0.08% పెరిగింది. $1800.2 వద్ద ట్రేడ్ అయ్యింది. అయితే స్పాట్ గోల్డ్ ధరలు కూడా 0.02% పెరిగాయి. నిన్స్ మధ్యాహ్నం 3.45 గంటల వరకు $1798/oz వద్ద ట్రేడ్ అయ్యాయి. మరోవైపు స్పాట్ మార్కెట్లో US డాలర్ ఇండెక్స్ 93.87 వద్ద ఉంది. కేవలం 0.03% పడిపోయింది. అదే బంగారం ధర ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ భారతదేశంలో అక్టోబర్ ఫ్యూచర్‌లో ముంబై MCX బంగారం 0.07% పడిపోయింది. మధ్యాహ్నానికి బంగారం రూ. 47,927/10 గ్రాములుగా ట్రేడ్ అయ్యింది.
దీపావళికి ముందు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగా భారతీయ బంగారం ధరలు ఎక్కువగా పెరిగాయి. దీపావళి, ధంతేరాస్ భారతీయ బంగారు వ్యాపారానికి సంబంధించిన 2 అత్యంత ముఖ్యమైన సంఘటనలు. కానీ పెరిగిన బంగారం ధర బంగారం అమ్మకాలపై ప్రభావం చూపుతుంది. ఈ త్రైమాసికంలో భారత్‌ బంగారం డిమాండ్‌ పడిపోయిందని ఇటీవలి డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది. కాబట్టి బంగారం ధర తగ్గితే ఈ పండుగ సీజన్‌లో మార్కెట్‌ను పుంజుకోవడానికి సహాయపడుతుంది. ఈ పండుగ సీజన్‌లో, బంగారం కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశం ఇటీవలి హాల్‌ మార్కింగ్ ఆదేశం. బంగారం స్వచ్ఛత గురించి వినియోగదారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆభరణాల వ్యాపారులందరూ హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: