పసిడి ప్రియులకు షాకిస్తున్న బంగారం ధరలు..!!

N.ANJI
దేశంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా మార్పులు జరిగాయి. ఇక దేశంలో ధరలు పరిశీలిస్తే 10 గ్రాములపై స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది. నేడు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 కొనసాగుతుంది. దేశంలో మెట్రో నగరమైన బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,640 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 కొనసాగుతుంది.
అలాగే దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,640 కొనసాగగా..   24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640కి చేరుకుంది. అంతేకాదు.. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500 కొనసాగుతుంది. అయితే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 చేరగా.. , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500 కొనసాగుతుంది.
ఇక ఏపీలో ప్రధాన నగరాలైన విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 చేరగా..  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 కొనసాగుతుంది. అలాగే విశాఖలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 చేరగా..  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 చేరింది. అయితే కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 కొనసాగుతుంది.
అయితే బులియన్‌ మార్కెట్లో పసిడి ధరలలో ప్రతి రోజు మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా బంగారం కొనుగోళ్లపై ప్లాస్‌ చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: