గోల్డ్ : మహిళలకు శుభవార్త.. మళ్లీ దిగివచ్చిన బంగారు ధరలు..!!

Divya
మాఘ మాసం రానే వచ్చింది.. మాఘ మాసం అంటే పెళ్లిళ్ల సీజన్ కాబట్టి ఈ పెళ్లిళ్లలో బంగారు ఆభరణాలు కొనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బంగారు ధరలు ఎలా ఉన్నా సరే కొనుగోలు చేయడానికి ప్రజలు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇకపోతే గత మూడు రోజుల నుంచి క్రమంగా క్షీణించిన బంగారు ధరలు ఒక్కసారిగా నిన్నటితో ఏకంగా 1200 రూపాయలు పెరిగి బంగారు కొనుగోలు చేసే వారికి చుక్కలు చూపించాయి. అయితే ఎట్టకేలకు ఈ రోజు కొంచెం క్షీణించి కొంతవరకు ఉపశమనం కలిగించింది అని చెప్పవచ్చు. అయితే ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాలను మనం తెలుసుకుందాం..


దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 .. నమోదుకాగా  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300 వుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450 దగ్గర కొనసాగుతోంది. ఇక మహా నగరం హైదరాబాద్‌ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 వుండగా..24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 దగ్గర కొనసాగుతోంది..విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 వుండగా.. 24 క్యారెట్ల ధర రూ.49,200 దగ్గర కొనసాగుతోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 వుండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 పలుకుతోంది.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 వుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ఢిల్లీలో రూ. 61,000 వుండగా ముంబైలో రూ. 61,100. ఇక  హైదరాబాద్‌లో రూ. 65,100 దగ్గర కొనసాగుతోంది. మొత్తానికి అయితే బంగారం వెండి ధరలు తగ్గాయని చెప్పవచ్చు ఈ మాఘమాస వేళ మహిళలకు శుభవార్త గా పరిగణించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: