బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో అంచనా వెయ్యడం చాలా కష్టం.. గంట గంటకు రేటు లో ఎంతో కొంత మార్పు వస్తుంది. ఈ వారంలో మూడు రోజులు ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు..నిన్న మార్కెట్ లో కాస్త తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి.. భారీగా బంగారం ధరలు పెరిగాయి. అదే విధంగా బంగారం ధరల దారిలో వెండి ధరలు కూడా నడిచాయి. మహిళలకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం పసిడి, వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి.
ఇక బుధవారం మార్కెట్ లో ధరలను పరిసీలిస్తె.. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,250 వుంది.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460 కు పెరిగింది. ఇకపోతే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.350 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.410 మేర పెరిగింది. అదే దారిలో వెండి కూడా పయనించింది. వెండి ధరలు కూడా తాజాగా రూ.400 మేర పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 64,400 గా ఉంది. దేశంలోని ప్రముఖ నగరాల తో పాటుగా, ఆంద్రా తెలంగాణలో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460 లుగా నమోదు అయ్యాయి. కాగా, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250, 24 క్యారెట్ల ధర రూ.50,460, చెన్నై 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,620, 24 క్యారెట్ల ధర రూ.52,000 గా వుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250, 24 క్యారెట్ల ధర రూ.50,460 నమోదు అయ్యింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,460 వద్ద కొనసాగుతోంది.హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉంది, అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460 కు పైకి కదిలింది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,250 ఉంది., 24 క్యారెట్ల ధర రూ.50,460 గా దూసుకుపోతుంది. విశాఖలో 22 క్యారెట్ల ధర రూ.46,250, 24 క్యారెట్ల ధర రూ.50,460 గా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరలు పెరిగితే..వెండి కూడా అదే దారిలో పరుగులు పెట్టింది. నిన్నటి ధరతో కొనసాగుతుంది. వెండి ధరలు కూడా ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. కేజీ వెండి ధర రూ. 70,000 ల వద్ద వుంది. మరి మార్కెట్ లో రేపు పసిడి,వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి.