గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వెండి, స్థిరంగా బంగారం ధరలు..

Satvika
బంగారం ధరలు రోజు రోజుకు పైకి కదులుతున్నాయి.. మొన్న భారీగా పెరిగిన గోల్డ్ రేటు, నిన్న మార్కెట్ లో కూడా భారీగా పెరిగింది. ఇకపోతే నేడు మార్కెట్ లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఇది మహిళలకు ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రధాన ఉత్పత్తుల పై ధరలు అమాంతం పెరిగి పొయాయని తెలుస్తుంది.. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా పసిడి ధరలు పైకి కదిలాయి.. బంగారం ధరలు స్థిరంగా వుంటే వెండి ధరలు మాత్రం భారీగా కిందకు తగ్గాయి..

భారత దేశంలో ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము.. న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 49,400 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890 నమోదు అయ్యాయి. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,400 కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల ధర రూ. 53,890 ఉంది.ఇక పోతే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 50, 200 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 54, 760 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,400 ఉంది.. 24 క్యారెట్ల ధర రూ. 53,890 గా ఉంది. తెలుగు రాష్ట్రాలలో కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి.

బంగారం ధరలు నిలకడగా ఉంటే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. ఏకంగా రూ.1,100 దిగొచ్చింది. దీంతో సిల్వర్ రేటు రూ. 74,600కు పడిపోయింది..వెండి కొనాలనుకునేవారికి ఇది చక్కటి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందుకే నేడు వెండి ఆభరణాలు కొనేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇది ఇలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పరుగులు తగ్గింది. ఔన్స్‌కు 0.19 శాతం తగ్గింది.. పసిడి రేటు ఔన్స్‌కు 2054 డాలర్లకు తగ్గింది. బంగారం దిగివస్తే వెండి మాత్రం పైపైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.22 శాతం పెరుగుదలతో 26.93 డాలర్లకు ఎగిసింది.. మార్కెట్ లో బంగారం పై ప్రభావం చూపే పరిస్థితితులు చాలానె ఉన్నాయి. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. రేపు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: