మహిళలూ... బంగారం ధర తగ్గిందట... కోనేసేయండి !

VAMSI
ఈ ప్రపంచంలో బంగారం అంటే ఇష్టం లేని వారు ఉంటారు అంటే నమ్మడం అంత సులభం కాదు. ముఖ్యంగా మహిళలు బంగారం అంటే చాలు అయస్కాంతం లా అలా అతుక్కుపోతారు. అందులోనూ బంగారం అనేది ఒక స్థిరాస్తి లాంటిది భవిష్యత్తులో అంతకంతకూ పెరిగి డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే కొందరు బంగారం ధర కాస్త తగ్గినా కేజీలు కేజీలు కొని దాచుకుంటుంటారు. ఇక బంగారం ధర తగ్గింది అంటే మహిళలు అయితే అస్సలు ఆగరు ఎంత వీలయితే అంత కొంటుంటారు. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
అయితే గత నాలుగైదు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరోసారి బంగారం ధరలు దిగొచ్చాయి. నేడు శుక్రవారం రోజున బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. ఇపుడు తగ్గిన ధరలు ఆ వివరాలు ఏంటో చూద్దాం పదండి.  హైదరాబాద్ నగరం విషయానికొస్తే అక్కడ ప్రస్తుత  బంగారం ధరలు ఇలా ఉన్నాయి. మార్కెట్‌లో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాలా రూ.220 తగ్గి, రూ. 50,400కు దిగి వచ్చింది. అదే విధంగా  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి, రూ46,200 గా ఉన్నది.
ఈ నేపథ్యంలో బంగారం తో పాటుగా వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.700 తగ్గి, రూ.61,100 కి చేరింది. ఇక బంగారం ప్రియులకు ఇది కాస్త మంచి అవకాశం అనే చెప్పాలి. బంగారం పెట్టుబడి దారులు కూడా ఈ క్రమంలో భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకెందుకు ఆలస్యం మహిళలు మీకు వీలైనంత పెట్టుబడిని ఈ బంగారంపై పెట్టండి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరికొద్ది రోజులు బంగారం ధరలు అటు ఇటుగా ఉండే అవకాశం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: