బరువు తగ్గే ఆపరేషన్ల వల్ల లాభమా ! నష్టమా ?
ఈ స్టడీలో 52 ఎడాలసెంట్స్ ని మోడరేట్ నుండి సివియర్ ఒబేసిటీ ఉన్న వారిని ఎక్జామిన్ చేశారు. ఇందులో 26 మంది స్లీవ్ గాస్ట్రెక్టమీ చేయించుకున్నారు. స్లీవ్ గాస్ట్రెక్టమీ చేయించుకున్న పేషెంట్స్ లో బోన్ మారో ఫ్యాట్ లో ఇంక్రీజ్ ఉంది, లంబార్ స్పైన్ లో బోన్ డెన్సిటీ లో డిక్రీజ్ ఉంది. స్లీవ్ గాస్ట్రెక్టమీ తరువాత బోన్ డెన్సిటీ లో లాస్ ఉండడం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ బరువు బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. బోన్ డెన్సిటీ యే కాక ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే హార్మోన్స్, న్యూట్రియెంట్స్ లో తేడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ పేషెంట్స్ లో బోన్ లాస్ ని ప్రివెంట్ చేయగలిగే మెకానిజంస్ ని గుర్తించాలి, ఒబేసిటీ సమస్య తో బాధ పడుతున్న ఎడాలసెంట్స్ కి బోన్ హెల్త్ గురించి మరింత అవగాహన కల్పించాలి. ఎడాలసెన్స్ లోనే బోన్ మాస్ పేరుకుంటుంది, ఈ సమయం లో ఆ ప్రాసెస్ తో ఇంటర్ఫియర్ అయ్యేది ఏదైనా, దాని వల్ల తరువాత లైఫ్ లో విపరీత పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది అని పరిశోధకులు చెబుతున్నారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.