చలికాలంలో డార్క్ చాక్లెట్ తింటే ఏమవుతుందో తెలుసా?

Divya

చాక్లెట్స్  అనగానే  చిన్న పెద్దా  తేడా లేకుండా పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటువుంటారు. డార్క్ చాక్లెట్స్ అంటే మరీ  స్పెషల్. ప్రియుడు ప్రియురాలి కోసం ముఖ్యంగా ఇచ్చేది ఈ డార్క్ చాక్లెట్.వందకు 75 శాతం మంది ఈ డార్క్ చాక్లెట్ ను ఎంతగానో ఇష్టపడతారు.అంతగా ఈ చాక్లెట్స్ కు ఆకర్షితులు అవ్వడానికి కారణం వీటి రుచి, రంగు, ఆకారం. పెద్ద పెద్ద పేరొందిన కంపెనీలు తమ లాభర్జన కోసం,పిల్ల,పెద్దలను ఆకర్శించడానికి కావాల్సిన విధంగా వీటిని తయారు చేస్తుంటారు.
అయితే ఈ డార్క్ చాక్లెట్స్ ను చలికాలంలో తినొచ్చా? అనే సందేహం అందరిలో  కలుగుతుంది.  చిన్న పిల్లలకు పెద్దగా తెలియదు ఏ సీజన్లో చాక్లెట్స్ తినాలో కానీ వాళ్ళు మారంచేస్తూ ఉంటారు.  పెద్ద వాళ్ళేమో చలికాలంలో చాక్లెట్ తింటే జలుబు చేస్తుందన్న అపోహలతో పిల్లలకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే చాక్లెట్స్ ఏ సీజన్లోనైనా హ్యాపీగా తినేయొచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా చలికాలంలోనే ఎక్కువగా తినాలి అని కూడా వారు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల శీతాకాలం లో ఎదురయ్యే జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుండి బయట పడవచ్చని  వైద్య నిపుణులు చెబుతున్నారు.అందుకు కారణం డార్క్  చాక్లెట్ లో కలిపే కోకో పౌడర్. ఈ కోకో పౌడర్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి.
ఈ డార్క్ చాక్లెట్ను రోజూ తినడం వల్ల శరీరానికి కావలసిన వేడి అందుతుంది. అంతేకాకుండా చర్మం పొడిబారకుండా చేసి, శరీరానికి కావాల్సిన తేమను అందిస్తుంది. ఒత్తిడి,మానసిక ఆందోళన, చికాకు వంటి సమస్యలను సైతం దూరం చేసే శక్తి ఈ డార్క్ చాక్లెట్స్ కు ఉంది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఈ డార్క్ చాక్లెట్స్  సీజన్ తో సంబంధం లేకుండా హ్యాపీగా తినవచ్చు.అయితే చాక్లెట్ ను కేవలం రోజుకు వంద గ్రాముల కంటే తక్కువ తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: