ఉసిరికాయతో డయాబెటిస్ రోగులకు చెక్ పెట్టవచ్చా?

Divya

 ఉసిరికాయ సహజంగా సిట్రస్ జాతికి చెందిన పండు. ఈ పండు తినడానికి కొంచెం పుల్లగానూ , వగరుగానూ  ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలను కూడా దరి చేరకుండా చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.  అయితే ఇప్పుడు ఉసిరికాయ వల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఇక్కడ ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
ఉసిరికాయలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం ఎంతగానో సహకరిస్తాయి. ఉసిరికాయను తరచూ తింటూ ఉండడం వల్ల చర్మకణాలు కాంతివంతంగా మారుతాయి.ఫలితంగా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి.అంతేకాకుండా రక్తంలో హిమోగ్లోబిన్లోని ఎర్ర రక్త కణాల వృద్ధిని పెంచి రక్తశుద్ధి జరిగేలా చేస్తాయి. ఉసిరికాయ జ్యూస్ ను చేసుకొనిఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల ఈ లాభాలన్నీ మన శరీరానికి చేకూరుతాయి.
సాధారణంగా చాలామందికి దగ్గు,జలుబు,జ్వరం, శ్వాసకోస సంబంధిత వ్యాధులు తరచూ  తలెత్తుతుంటాయి.ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్  ఉసిరికాయ రసంలో, ఒక టేబుల్ స్పూన్ తేనె,అర టీ స్పూన్ అల్లం రసం కలిపి తాగాలి.  ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే శక్తి ఉసిరికాయకు ఉంది. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు రోజూ ఉసిరికాయ తినడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
ఉసిరిలో ఎక్కువగా పీచు పదార్థాలు, నీరు శాతం ఉంటుంది. ఈ రెండు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. ఫలితంగా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. విటమిన్ సి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణాశయంలో ఏర్పడే పుండ్లను కూడా అరికట్టవచ్చు. అంతేకాకుండా ఉసిరికాయలో ఉండే కాల్షియం ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది.గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపించడంలో మొదటి పాత్ర వహిస్తుందితక్కువ ధరకే లభించే ఉసిరికాయను తరచూ ఆహారంలో తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: