వీటితో థైరాయిడ్ కు చెక్ పెట్టవచ్చా..?
ఇకపోతే థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు జుట్టు ఊడిపోతుంది . మహిళల్లో నెలసరి సమయంలో ఇబ్బందులు.. కడుపునొప్పి.. శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఇలా మరెన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే థైరాయిడ్ కి చెక్ పెట్టాలి అంటే ఉల్లి, కొత్తిమీర ఇందుకు సరైన మెడిసిన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ తో బాధపడుతున్న వారికి కొత్తిమీర చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి తో పాటు డైటరీ ఫైబర్ థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది. ఇకపోతే కొత్తిమీర తీసుకోవడం వల్ల ఎముకల నొప్పి నుండి ఉపశమనం పొందడం తోపాటు కొత్తిమీర లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా వైరస్ నుంచి బయటపడవచ్చు.
ముందు రోజు రాత్రి ఒక గ్లాసు నీటిలో కొత్తిమీర ఆకులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ నీటిని తాగాలి. ఇక దీన్ని ఖాళీ కడుపుతో తాగితే థైరాయిడ్ కారకాలను నాశనం చేయవచ్చు. ఇక ఉల్లిపాయ కూడా థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది. ఉల్లి రసం తాగడం వల్ల ఉల్లి రసం లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు థైరాయిడ్ సమస్యను తగ్గిస్తాయి.