ఈ టీ తాగితే ఎక్కువ కాలం బ్రతుకుతారు?

Purushottham Vinay
టీ తాగితే లైఫ్ టైం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఏ టీ పడితే ఆ టీ తాగకూడదు. దానికి కొన్ని షరుతులు కూడా ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఓ రకంగా టీ ప్రేమికులకు సంతోషం కలిగించే విషయమే, ప్రతిరోజూ కూడా రెండు కప్పుల టీ తాగేవారు ఎక్కువ జీవించే అవకాశముందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కానీ అది అది బ్లాక్ టీ మాత్రమే. ప్రతి రోజూ బ్లాక్ టీ తాగే వారికి జీవిత కాలం పెరుగుతుందని శాస్త్రీయ అధ్యయనంలో తేలింది.అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. టీ తాగని వారితో పోలిస్తే.. ప్రతి రోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు బ్లాక్ టీ తాగేవారి మరణాల ప్రమాదం 9 నుంచి 13 శాతం తక్కువగా ఉందని తేలింది. అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ కి చెందిన మాకి ఇనౌ-చోయ్‌తో సహా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. బ్లాక్ టీ ఎక్కువ స్థాయిలో తీసుకున్నప్పటికీ.. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చని కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీ తాగేవారి సంఖ్య చాలా ఎక్కువుగానే ఉంది. చాలా దేశాల్లో బ్లాక్ టీ తాగేవారి సంఖ్య మోస్తరుగానే ఉంది. అధ్యయనం కోసం.. పరిశోధన బృందం యూకే బయోబ్యాంక్ నుంచి డేటాను ఉపయోగించి.. అన్ని కారణాలు, నిర్దిష్ట మరణాలతో టీ వినియోగం అనుబంధాలను అంచనా వేసింది.


ఈ అధ్యయనం కోసం యూకే బయోబ్యాంక్‌ నుంచి.. 2006 నుంచి 2010 మధ్య లోతైన జన్యు, ఆరోగ్య సమాచారాన్ని తీసుకున్నారు. దాని నుంచి తయారు చేసిన ప్రశ్నాప్రతాన్ని.. 40 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల దాదాపు 5లక్షల మంది పురుషులు ఇంకా స్త్రీలకు ఇచ్చి వారి నుంచి సమాచారాన్ని సేకరించారు. వీరిలో 85 శాతం మంది రెగ్యులర్‌గా టీ తాగుతున్నారని.. వారిలో మొత్తం 89 శాతం మంది బ్లాక్ టీ తాగుతున్నారని పేర్కొన్నారు.ఇంకా ఈ అధ్యయనం ప్రకారం, పాలు లేదా చక్కెర వేసుకుని టీ తాగే వారికి ఆరోగ్య ప్రయోజనాలలో గణనీయమైన మార్పులేమి లేవని తెలిపారు. తమ పరిశోధనలు ఇప్పటికే ప్రతిరోజూ టీ తాగే వ్యక్తులకు సంబంధించనదని, ఈఅధ్యయనం ప్రకారం ప్రజలు టీ తాగడం ప్రారంభించాలా లేదా ప్రస్తుతం తాగుతున్న పరిమాణాన్ని మార్చాలా అనే దానిపై తాము ఎటువంటి సిఫార్సు చేయబోమని, ఇది పూర్తిగా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్చపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. టీ తీసుకోవడం వల్ల మరణాలు తగ్గుతాయని ఈ అధ్యయనం రుజువు చేయలేదని.. ప్రస్తుతం టీ తాగుతూ ఉంటే.. ముఖ్యంగా బ్లాక్ టీ తాగుతూ ఉంటే.. దానిని కంటిన్యూ చెయ్యండని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: