మొలకెత్తిన గింజల ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం?

Purushottham Vinay
మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ గింజల్లో కీర, క్యారెట్, బీట్ రూట్ వంటి కూరగాయల ముక్కలను కలుపుకుని తీసుకుంటే శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి. మొలకెత్తిన గింజలను తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని ద్వారా గుండె నొప్పిలాంటి సమస్యలు ఉండవు. వాటిలో ఉండే ఫైటోఎరోజెన్ నిల్వలు , గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగడతాయి.మొలకెత్తిన గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి వంటివి అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ కె రక్త గడ్డకట్టడానికి, కాలేయ పనితీరు సక్రమంగా పని చేయడానికి తోడ్పడుతుంది. గింజలు త్వరగా జీర్ణమవుతాయి. గర్భిణీలు మొలకలు తింటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. మొలకలు జీవంతో కూడుకున్న ఎంజైమ్ లు ఉన్న సహజమైన ఆహారం. ఈ గింజలు మొలకెత్తేటప్పుడు విటమిన్ ఎ 2 రెట్లు, విటమిన్ బి మరియు సి లు 5 నుండి 10 రెట్లు అధికంగా లభ్యమవుతాయి. పెసర్లు, శనగలు, పల్లీలు, బఠాణీలు, గోధుమలు, జొన్నలు, సోయా బీన్స్, చిక్కుడు వంటి వాటిని మొలకెత్తించి తీసుకోవచ్చు.ఆరోగ్యానికి హానిని కలిగించే కొవ్వు, కెలస్ట్రాల్ వంటివి వీటిలో ఉండవు. శరీరాన్ని సంరక్షించే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.


మొలకలకు క్షార గుణం ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరం చైతన్యవంతమై నిత్య యవ్వనంగా కనిపిస్తారు. శరీరాన్ని శుద్ధి చేస్తాయి. మొలకెత్తిన గింజల్లో జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్ లు అధికంగా ఉంటాయి. ఈ ఎంజైమ్ లు ప్రోటీన్లను, శరీరానికి ఉపయోగపడే ఆమైనో ఆమ్లాలను, పిండి పదార్థాలను గ్లూకోజ్ గా మారుస్తాయి. మొలకల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని కూడా తగ్గిస్తాయి.ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పెసర్లు, శనగలు, పల్లీలను మొలకెత్తించి తీసుకోవాలి. వీటిని రోజు వారిగా ఆహారంగా తీసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు సైతం చెబుతున్నారు. కేలరీలు అధికంగా ఉండే ఆహారలకంటే ఫైబర్ అధికంగా ఉండే మొలకెత్తిన గింజలు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది.మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఇలా అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అన్నీ పోషకాలు తగిన మోతాదులో ఉండే ఆహారాల్లో మొలకెత్తిన గింజలు ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: