అందంగా మారాలి అంటే దాల్చిన చెక్క వాడాల్సిందే..!

Divya
ప్రస్తుతం భారతీయ హిందూ వంటశాలలో ఎక్కువగా కనిపించే అత్యంత సాధారణ సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క కూడా ఒకటి. ఇది అనేక భారతీయ వంటకాలలో రుచిని మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ మసాలా దాని ఆరోగ్య ప్రయోజనాలు కారణంగా అనేక ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా దీనిని ఆహారంలో చేర్చుకోవడం అవసరం.. నిజానికి ఈ దాల్చిన చెక్క ఒక ఆరోగ్యమైన ప్రయోజనాలను మాత్రమే కాదు విస్తృతమైన సౌందర్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది..
దాల్చిన చెక్క నూనె, పౌడరు వంటి అనేక చర్మ ప్రయోజనాలను దాల్చిన చెక్కతో ఉపయోగిస్తారు.  ఇది చెట్టు లోపలి బెరడులో మనకు కనిపిస్తుంది.  కాబట్టి చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను, చర్మ సమస్యలను దూరం చేస్తుంది. మొటిమలను తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది.  క్రిమి నాశన గుణాల కారణంగా మొటిమలను తగ్గించడంలో దాల్చిన చెక్క మొదటి పాత్ర పోషిస్తుంది.  ఇకపోతే మొటిమలు,  మచ్చలు త్వరగా నయం అవడానికి చాలామంది వైద్యులు లేపనాలను ఇస్తూ ఉంటారు.. వాటికి బదులు ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిలో .. మూడు టేబుల్ స్పూన్ల తేనె వేసి మందపాటి పేస్ట్ ని తయారు చేసి.. మొటిమలకు రాయాలి.. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు మాయమవుతాయి.
పొడి చర్మ సమస్యను కూడా దూరం చేయడంలో దాల్చిన చెక్క చాలా చక్కగా పనిచేస్తుంది. మంటగా దురదగా ఉన్నవారు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి ప్రభావిత ప్రాంతాలలో పూయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. చర్మం రంగును పెంపొందించడంలో సహాయపడుతుంది.  అలాగే చర్మం యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ ఫంగల్ లక్షణాల కారణంగా రక్షిత పొరను సృష్టించేటప్పుడు ఇది మన రంగును కూడా మెరుగు పరుస్తుంది.. దాల్చిన చెక్క పొడిలో పెరుగు , నిమ్మరసం, అరటిపండ్ల గుజ్జు వేసి మాస్క్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే చర్మం మరింత ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: