ఉపవాసం – యోగలో ఒక భాగం ఆద్యాత్మిక అభ్యాసంలో ఉపవాసం అనేది ఒక శక్తివంతమైన సాధనం. కానీ ఈ రోజుల్లో నిపుణులు దాన్ని బరువు తగ్గించటానికి ఒక సాధనంగా వాడుతున్నారు. ‘ ఆరోగ్య నిపుణులు’ దాన్ని జీర్ణవ్యవస్థకి విశ్రాంతినిచ్చే సాథనంగా వాడమని చెపుతున్నారు. మీ గుండెకి ఎప్పుడైనా విశ్రాంతి ఇవ్వాలని అనిపించిందా మీకు? లేదా? మరైతే జీర్ణకోశాన్ని గురించి ఆలోచించేటప్పడు మాత్రం దానికి విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచన ఎందుకొస్తోంది.? జీర్ణకోశం కూడా, గుండెలాగే, దానంతట అదే పనిచేసే అవయవం (ఆగకుండా పనిచేసేట్టూ నిర్మించబడింది.) ఇక దానికి ఒత్తిడి, కలగకుండా ఉండాలంటే మనం చెయ్యవలసిన పని అప్పుడప్పుడూ, కొంచెం కొంచెం ఆహారాన్ని దానికి అందివ్వటం నిజానికి యోగ కొదరి నమ్మకాలకి విరుద్దమైంది. అందులో అతి పనికిరాదు, ఉపవాసాలతో సహా, ఇక మీరు ఆహారాన్ని గురించి తప్ప ఇంకేమీ ఆలోచించలేనప్పడూ ఉపవాసాల వల్ల లాభమేముంటుంది? యోగ చెప్పేదేమిటీ, శరీరానికి, మనకీ లంకె ఉంది. అందుకని మీరు తిండి గురించి, తినటం గురించీ ఆలోచించినా కూడా, దాని ప్రభావం వెంటనే మీ శరీరం మీద కనిపిస్తుది. అంటే అర్థం, చాకొలేట్ కేక్ గురించి ఆలోచించినా మీరు బరువు పెరుగుతారన్న మాట !
మరింత సమాచారం తెలుసుకోండి: