అలోవీరా జ్యూస్ తాగితే కడుపు క్లీన్ అయిపోతుందా..?

Vasishta

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవుతున్నవారిలో కొంతమంది అలోవీరా జ్యూస్ తాగి వస్తున్నారంటూ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకును సబర్వాల్ చెప్పడంతో అలోవీరా జ్యూస్ పై చర్చ మొదలైంది. అలోవీరా జ్యూస్ కు అంత పవరుందా.. అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అలోవీరా లక్షణాలేంటో ఓసారి చూద్దాం.

 

వాస్తవానికి అలోవీరా అద్భుతమైన వైద్యగుణాలున్న మొక్క. దీన్ని తెలుగులో కలబంద అని కూడా పిలుస్తారు. గాయపడ్డ తన సైన్యాన్ని కాపాడుకునేందుకు అలోవీరా మొక్కకోసం అలెగ్జాండర్ ఏకంగా ఓ ద్వీపంపై యుద్ధం చేశాడని ప్రతీతి. దీన్ని బట్టి అలోవీరా ఎంత పవర్ ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. కాలిన గాయాలతో పాటు పుండ్లు, జ్వరం తదితరవాటిని మాన్పడంలో అలోవీరా ఎంతో ఉపయోగపడుతంది.

 

కలబందను కోసినప్పుడు దాని నుంచి తెల్లటి ద్రవము వస్తుంది. ఇటీవలికాలంలో మహిళలు తమ సౌందర్యపోషణకోసం అలోవీరాను విరివిగా ఉపయోగిస్తున్నారు. అలోవీరా మంచి పోషకపదార్థం కూడా.! దీంట్లో మినరల్స్, ఎంజైమ్స్, ఫాటీ ఆసిడ్స్, అమినో యాసిడ్స్, పాలీశాచరైడ్స్ ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలన్నీ తొలగిపోయి శుభ్రపడుతుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. మలబద్దకం లాంటివి ఉండవు. యాంటి యాక్సిడెంట్ కావడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.       అలోవీరా జ్యూస్ తాగితే బరువు కూడా తగ్గుతారు. కలబంద ద్రవాన్ని పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటే తళతళలాడిపోతుంది.

 

చూశారుగా అలోవీరా ఔషధగుణాలు. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవుతున్నవారు అలోవీరా జ్యూస్ తాగిరావడానికి కారణం అది పొట్టలోని మలినాలన్నింటినీ క్లీన్ చేయడమే.! ఓ గ్లాస్ జ్యూస్ తాగితే చాలు – కడుపు మొత్తం క్లీన్ అయిపోతుంది. అలాంటిసమయంలో రక్తనమూనాలు సేకరించినా కూడా ఏమీ కాదు. అందుకే వీళ్లంతా అలోవీరాను ఎంచుకున్నారు. అయితే సిట్ మాత్రం ఈ విషయాన్ని గమనించి అథ్లెట్ డోపింగ్ మెషీన్ ద్వారా పరీక్షలు చేయాలనుకుంటోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: