“శాఖాహారులు” తప్పక చదవవలసిన ఆరోగ్య నియమం...“B 12”

Bhavannarayana Nch

ప్రతీ మనిషి వాతవారంలో జరిగి సహజమైన మార్పుల వలన గానీ..శరీరంలో జరిగే జీవక్రియల దిశలు మారడం వలన లేక మనం సరైన ఆహరం తీసుకోకపోవడం వలనో ఇలా ఎదో ఒక కారణంతో జబ్బు పడుతూ ఉంటాడు అయితే ఈ జబ్బు పడటానికి గల కారణాలని అన్వేషించకుండానే వ్యాధి ఏమిటనే విషయాని పక్కన పెట్టి అనవసరం మందులు వేసుకుంటూ మరింతగా నష్టపోతూ ఉంటాడు..ఉదాహరణకు చాలా మందికి శరీర నొప్పులతో బాధపడితే, పెయిన్ కిల్లర్లు వాడుతూ ఉంటారు  అంతే గాని మీకు తరచుగా ఎదురయ్యే ఈ నొప్పికి ఏమిటా కారణం అనే విషయం మాత్రం మర్చిపోతారు.

 

అసలు మన శరీరంలో విటమిన్లు సక్రమంగా ఉన్నాయా హెచ్చుతగ్గులు గా ఉన్నాయా అనే విషయాన్ని ఎవ్వరూ గుర్తించరు..అసలు ఈ నొప్పులు నరాలు లాగేయడం వంటి లక్షనాలు విటమిన్-B12 వలన కలుగుతాయి ఈ లోపం వలన కలుగుతాయి అంతేకాదు ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల తయారీలో విటమిన్-B12 కీలక పాత్ర పోషిస్తుంది  రోగనిరోధక వ్యవస్థకు కూడా ఇది ఎంతో అవసరం ఇది రెగ్యులర్గా ఎర్ర రక్తకణాల ఉత్పత్తి ప్రక్రియకు సహాయపడుతుంది & విటమిన్-B12 పైనే మెదడు పనితీరు ఎక్కువగా పని చేస్తుంది..చాలా మందికి మతిమరుపు ఎక్కువగా ఉంటుంది దానికి కారణం ప్రధానమగా విటమిన్-B12 లోపమే 


అయితే ఈ లోపం ఎలా సంభవిస్తుంది అంటే మీ శరీరం ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి ఈ విటమిన్ తగినంత స్థాయిలో లేనప్పుడు, విటమిన్-B12 లోపం సంభవిస్తుంది. ఇది కండరాల బలహీనత, నరాల సమస్యలు, ఆకలి లేకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం, అలసట & రక్తహీనత వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది...అయితే ఈ విటమిన్ మన శరీరంలో తగిన స్థాయిలో ఉండాలంటే పాలు బాదంపాలు, కొబ్బరిపాలు, సోయా ఉత్పత్తులు, తృణధాన్యాలు, పుట్టగొడుగులు, మజ్జిగ తేట, జున్ను & పెరుగుల వంటి మరి కొన్ని శాఖాహారాలలో విటమిన్-B12 చాలా సమృద్ధిగా దొరుకుతుంది.


ఈ విటమిన్ లోపం వలన ఎక్కువగా అలసి పోవడం..ముఖం నీరడంగా ఉండటం, శరీరంలో ఎర్రరక్త కణాల సమాఖ్య తగ్గిపోతూ ఉండటం జరుగుతుంది...మెల్లగా చురుకు దానం తగ్గుతుంది..కండరాలు బలహీనం అవుతాయి..ఇంకొక ముఖ్యమైన విషయం ఏమింటే..ఈ లోపం వలన ముఖ్యం రంగు పసుపుగా మారడం పాలిపోయినట్టుగా ఉండటం రక్త హీనత ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

 

 







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: