తరచూ ఆగ్రహంతో ఊగిపోయేవారు ఇక జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే..? కోపాన్ని పక్కనబెట్టకపోతే.. గుండెపోటు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. ఎప్పుడో ఓసారి కోపగించుకుంటే పర్లేదు కానీ.. చిన్న చిన్న విషయాలకు కోపంతో తరచూ ఆగ్రహంతో ఊగిపోయేవారు ఇక జాగ్రత్తగా వుండాలి.
ఎందుకంటే..? కోపాన్ని పక్కనబెట్టకపోతే.. గుండెపోటు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. ఎప్పుడో ఓసారి కోపగించుకుంటే పర్లేదు కానీ.. చిన్న చిన్న విషయాలకు కోపంతో ఊగిపోయేవారు మాత్రం కోపాన్ని నియంత్రించుకోలేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని యూరోపియన్ హార్ట్ జర్నల్ ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైంది.
కోపానికి, గుండెపోటుకి సంబంధం వుందని అధ్యయనంలో వెల్లడైనట్లు అధ్యయనకారులు చెప్తున్నారు. వ్యక్తి తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రెండు గంటల్లోపు గుండెపోటు వచ్చే ప్రమాదం వుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.
తరచుగా ఆగ్రహం తెచ్చుకుని పెద్దగా అరిచేవారిలో గుండెపోటు ప్రమాదం అధికంగా వున్నట్లు అధ్యయనకారులు చెప్పారు. ఇలా తరచూ కోపావేశాలకు గురై పెద్దగా అరిచే వారిలో ఇప్పటి వరకు గుండె సమస్యలు లేకపోయినా.. హృద్రోగ సమస్యలు వచ్చే ఆస్కారం వుందని అధ్యయనకారులు తెలిపారు.