అధిక బరువును తగ్గించుకునేందుకు నేటి తరుణంలో ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. కొన్ని టిప్స్ పాటిస్తే ఈజీగా స్లిమ్ కావొచ్చు. బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు జిమ్ లో చెమటలు చిందిస్తుంటే.. మరి కొందరు.. నోరు కట్టేసుకొని కూర్చుంటారు. అయితే.. ఈ వ్యయప్రయాసలు ఏమీ లేకుండానే బరువు సులభంగా తగ్గొచ్చు అంటున్నారు.
గ్రీన్ లేదా మిరియాల టీ, రోజ్ టీ తాగాలి. ఇతర టీల కంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి దాదాపు వీటికి ఎక్కువగా ఉంది.
- బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగాలి. ఈ టీ ఒక్క రోజులో శరీరంలోని దాదాపు 70 క్యాలరీల శక్తిని తగ్గిస్తుంది. రెగ్యులర్గా దీన్ని తాగడం ద్వారా దీర్ఘకాలంగా ఫ్యాట్పై ఇది ఫైట్ చేస్తుంది.
- చైనాలో దొరికే స్టార్ అనైజ్ అనే పండు ద్వారా తయారే చేసే టీని స్టార్ అనైజ్ టీ అంటారు. దీని ద్వారా ఈజీగా బరువు తగ్గొచ్చు. అలాగే ఉదర సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. అతిసారం, వికారం మొదలైన సమస్యలకు ఈ టీ చక్కటి పరిష్కారం.
- రోజ్ టీ కూడా బరువు తగ్గేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని చాలా రకాల సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. రోజ్ టీ శరీరానికి కావాల్సిన విటమిన్ ఏ, బీ3, సీ, డీ, ఈలను అందిస్తుంది. ఇది చర్మాన్ని కూడా చాలా అందంగా తయారు చేస్తుంది.
- ఊలాంగ్ టీ ద్వారా ఊబకాయం ఈజీగా తగ్గుతుంది. శరీరంలోని ఫ్యాట్ ను వెంటనే బర్న్ చేసే గొప్ప గుణం దీనికి ఉంది. అయితే దీన్ని రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ తాగడం అంతమంచిది కాదు.
- మిరియాలను మనం వంటల్లో విరివిగా ఉపయోగిస్తాం. వీటితో తయారు చేసే టీని తాగితే శరీర బరువును తగ్గించుకోవచ్చు. దీనికి ఈజీగా క్యాలరీస్ తగ్గించే శక్తి ఉంది. అలాగే మిరియాల టీతో మలబద్దకం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. మిరియాలతో చేసిన టీలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి.