చ‌క్కెర ఉప‌యోగిస్తున్నారా.. అయితే ఈ ముప్పు త‌ప్ప‌దు..

Kavya Nekkanti
సాధార‌ణంగా వెన‌క‌ట కాలంలో చక్కెరని చెరుకు రసం నుండి నేరుగా తీసుకుని, శుద్ధిచేయని ముడి రూపంలో వాడేవారు. వడగట్టిన రసాన్ని గడ్డకట్టేంత వరకూ కాచి, దాన్ని ఒక మోస్తరు రాళ్ళుగా విడగొట్టి చక్కెరగా స్వీకరించేవారు. కానీ ఈరోజున, వాణిజ్యపరంగా దొరుకుతున్న చక్కెర చాలావరకూ రసాయన ప్రక్రియలకు గురైనది. చక్కెర అనేది ఒక రకమైన విషం, ఇది అనేక వ్యాధులకు కారణమని తెలుస్తోంది. 


చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్. బాణసంచా తయారీలో ఉపయోగించే మసాలా సల్ఫర్.  సల్ఫర్ చాలా భారీ రసాయన మూలకం. అది మానవ శరీరంలోకి వెళ్ళిన తర్వాత, దాన్ని బయటకు తీయడం అసాధ్యం అవుతుంది.  చక్కెర చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. దీనివల్ల గుండెపోటుకు దారితీస్తుంది. అదే విధంగా చక్కెర శరీర బరువును అధికం చేయ‌డంమే గాక‌ రక్తపోటును కూడా పెరిగేలా చేస్తుంది. 


ఆధునిక వైద్య శాస్త్రం చక్కెరలో తీపి రుచిని సుక్రోజ్‌గా గుర్తిస్తుంది. సుక్రోజ్ మానవులకు మరియు జంతువులకు జీర్ణించుకోవడం కష్టం.  చక్కెర తయారీ ప్రక్రియలో ఇరవై మూడు హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. అలాగే డయాబెటిస్‌కు ప్రధాన కారణం చక్కెర. శ‌రీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదలకు, పక్షవాతం రావడానికి చక్కెర ప్రధాన కారణం. సో.. ఇన్ని దుష్ప్రభావాలు ఉన్న చ‌క్కెర‌కు దూరంగా ఉండడం చాలా ఉత్తమం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: