వైరల్ ఫీవర్ బారిన‌ప‌డ‌కుండా ఉండాలంటే ఇలా..!

Kavya Nekkanti
ఈ సీజన్‌లో వైరల్ జ్వరం అనేది చాలా సహజంగా వస్తుంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. దోమలు కుట్టడం, సడెన్‌గా వాతావరణంలో, ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు, బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి అనేక అంశాలు వైరల్ ఫీవర్‌కు కారణమవుతాయి. అలాగే ఇల్లుని శుభ్రంగా పెట్టుకోవడం ఇంట్లో అందరి బాధ్యత. దీంతో పాటు చుట్టూ ప‌రిశ‌రాల‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా జ్వరాలతో మంచం పట్టాల్సి వస్తుంది. అలాగే వైర‌ల్ ఫీవ‌ర్ రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు చాలా అవ‌స‌రం.


తరచూ అనారోగ్యాలకు గురికాకుండా ఉండాలంటే రోజును గోరు వెచ్చని నీటితో ప్రారంభించ‌డం చాలా మంచిది. అలాగే ఆహారాన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే తినడానికి ప్రయత్నించాలి. మిగిలి పోయిన పదార్థాలు మళ్లీ వేడి చేసుకుని అస్స‌లు తిన‌కూడ‌దు. ఇక జ‌లుబుతో పాటు దగ్గు, జ్వరం వస్తుంటే ధనియాలు చక్కటి ఔషధంలా పనిచేస్తాయి. రెండు చెంచాల ధనియాలను కప్పు నీటిలో వేసి మరిగించాలి. 


అవి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా రోజుకి నాలుగైదు సార్లు తాగుతుంటే ఉపశమనం ఉంటుంది.  అదే విధంగా గుప్పెడు {{RelevantDataTitle}}