ఆ కుటుంబం పాలిట శాపమైన డెంగీ విషజ్వరం ... మృత్యు వాతపడిన నాలుగు తరాలు
డెంగీ విషజ్వరం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబం కు చెందిన నాలుగు తరాల వారు డెంగీ విషజ్వరం సోకి మృతి చెందారు . కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు డెంగీ విషజ్వరం బారిన పడి మృతి చెందడం ... వారి బంధువుల్ని కలిచి వేస్తోంది . ఈ నెల 16 న మంచిర్యాలకు చెందిన రాజగట్టు డెంగీ విషజ్వరం సోకి మృతి చెందాడు . ఆ తరువాత ఈ నెల 27 న అతని కూతురు కు కూడా డెంగీ సోకి మరణించింది .
తాజాగా అతని భార్య సోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లో డెంగీ విషజ్వరానికి చికిత్స పొందుతూ మృతి చెందింది . సోనీ డెంగీ తో పోరాడుతూనే, మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది . బుధవారం సోనీ మృతి చెందడం తో ఆ కుటుంబం లో పూర్తిగా విషాదఛాయలు అలుముకునున్నాయి . రాజగట్టు తాత కూడా గతం లో డెంగీ విష జ్వరం సోకి మృతి చెందడంతో , ఆ కుటుంబం నాలుగు తరాల వారిని డెంగీ జ్వరం బలిగొంది . మంచిర్యాల జిల్లాలో డెంగీ విషజ్వరాలు ప్రబలుతుండడం తో స్థానికులు తీవ్ర కలవరం చెందుతున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ విష జ్వరాలు విజృభిస్తుండడం , ఇప్పటికే పలువురు మృత్యువాత పడడం తో రాష్ట్ర హైకోర్టు కూడా ప్రభుత్వం పై సీరియస్ అయింది.
డెంగీ నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది . ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా ? అంటూ అసహనం వ్యక్తం చేసింది . అయితే రాష్ట్ర మంత్రులు మాత్రం విషజ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కాదని చెబుతూ ... కాలం వెళ్లబుచ్చుతున్నారు . విషజ్వరాల బారిన పడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రభుత్వం మాత్రం నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటో వెల్లడించకపోవడం విస్మయం కలిగిస్తోంది .