పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా... జాగ్రత్త...!

Reddy P Rajasekhar

సాధారణంగా బయటకు వెళ్లిన సమయంలో చాలామంది పేపర్ కప్పుల్లో టీ తాగుతూ ఉంటారు. వైద్యులు ఈ పేపర్ కప్పుల్లో టీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. సాధారణంగా పేపర్ కప్పుల తయారీకి థర్మాకోల్ ను వాడతారు. కానీ గత కొంతకాలం నుండి పేపర్ కప్పుల తయారీకీ ఎక్కువగా పాలియస్టర్ ను ఉపయోగిస్తున్నారు. పాలియస్టర్ తో తయారైన పేపర్ కప్పుల్లో టీ పోసిన వెంటనే వేడి వేడి ప్లాస్టిక్ కణాలు టీలో కలుస్తాయి. 
 
ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి చేరితే క్యాన్సర్, థైరాయిడ్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఇంట్లో లేదా ఆఫీసులో టీ గాజు గ్లాసు లేదా స్టీల్ గ్లాసుతో తాగుతాం. కానీ బయటకు వెళ్లిన సమయంలో మాత్రం పేపర్ కప్పుల్లో తాగాల్సి ఉంటుంది. గాజు గ్లాసు, స్టీల్ గ్లాసులలో టీ తాగటం వలన మన శరీరానికి ఎటువంటి నష్టం కలగదు. కానీ ప్లాస్టిక్ తో తయారైన పేపర్ కప్పులలో టీ తాగటం వలన ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 
 
పేపర్ కప్పుల్లో టీ తాగటం వలన జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతినటంతో పాటు చిన్నప్రేగుల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. గాజు గ్లాసుల్లో టీ తాగితే మంచిదని పేపర్ కప్పులకు వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చర్మ సంబంధిత రోగాలు, అలసట, దృష్టిలోపాలు, హార్మోన్ల అసమతుల్యతలాంటి ఎన్నో సమస్యలు పేపర్ కప్పుల్లో టీ తాగే వారిలో వస్తాయి. ప్లాస్టిక్ కప్పులకు పూసే ఆర్టిపిషియల్ వాక్స్ కూడా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: