బీరు తాగటం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా...?
ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిశోధనల్లో ఉత్తమంగా శరీరాన్ని సంరక్షించడంలో బీరు బాగా పనిచేస్తుందని తేలింది. ఈ పరిశోధనల్లో బీరు ఎన్నో రోగాలను కూడా నయం చేస్తుందని తేలింది. బీరులో విటమిన్ బి తో పాటు భారీ స్థాయిలో ప్రోటీన్లు కూడా ఉంటాయి. బీరులో విటమిన్ బి, ప్రోటీన్లు వైన్ కంటే అధికంగా లభిస్తాయి. శరీరానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు బీరులో ఉంటాయి.
జీర్ణక్రియ ప్రక్రియలో ఎంతో కీలక పాత్ర వహించే ఫాస్పరస్, పొటాషియం, సెలీనియంలాంటి ఖనిజాలు కూడా బీరులో ఎక్కువమొత్తంలో లభిస్తాయి. జింక్, మెగ్నీషియం, సోడియం, సిలికాన్, కాపర్ లాంటి మినరల్స్ కూడా లభిస్తాయి. పరిశోధకులు చెసిన పరిశోధనలో బీరు తలనొప్పిని కూడా తగ్గిస్తుందని తేలింది. రెండు గ్లాసుల బీరు తలనొప్పి వచ్చిన సమయంలో తాగితే తలనొప్పి వెంటనే తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
సాధారణంగా తలనొప్పికి చాలామంది పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకుంటారు. కానీ ట్యాబ్లెట్ కంటే రెండు గ్లాసుల బీరు తాగినవారికే తలనొప్పి త్వరగా తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు చేపట్టిన డాక్టర్ ట్రెవర్ థామ్సన్ తగిన మోతాదులో బీరు తీసుకుంటే పెయిన్ కిల్లర్ కంటే బీరు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుందని తెలిపారు. 400 మందిపై 18 స్టడీస్ జరిపి యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్ విచ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
తగిన మోతాదులో బీరు తీసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. భారీ స్థాయిలో బీరును తాగితే మాత్రం బీరు వలన సైడ్ ఎఫెక్ట్స్ఎదుర్కోవాల్సి రావచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.