నిమ్మరసం తాగుతున్నారా... జాగ్రత్త...?
నిమ్మరసం తాగితే శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిమ్మరసం తాగడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు కడుపు ఉబ్బరం, అల్సర్ లాంటి సమస్యలు దూరమవుతాయి. నిమ్మరసం తాగేవారిలో పొట్టలోని కొవ్వు కరగటంతో పాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కానీ నిమ్మరసం అతిగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు. వైద్య నిపుణులు నిమ్మరసం అధికంగా తాగటం వలన శరీరంలో విటమిన్ సి ఎక్కువైతే కొన్ని దుష్ప్రభావాలు తప్పవని చెబుతున్నారు.
నిమ్మరసం అధికంగా తీసుకునేవారికి కడుపునొప్పి, లూజ్ మోషన్ సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా నిమ్మరసం తీసుకుంటే గొంతునొప్పి, చెస్ట్ పెయిన్, వాంతులు, వికారం, హార్ట్ బర్న్ కు దారితీస్తుంది. నిమ్మరసం అధికంగా తీసుకునేవారిలో పెప్టిక్ అల్సర్ సమస్యలు వస్తాయి. నిమ్మలో అధికంగా ఉండే ఆక్సాలేట్స్ క్రిస్టల్స్ గా మారి కిడ్నీలో రాళ్లుగా ఏర్పడతాయి. నిమ్మరసం ఎక్కువగా తాగే వారిలో శరీరంలో ఐరన్ స్థాయి పెరుగుతుంది.
ఐరన్ స్థాయి పెరిగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిమ్మరసం ఎక్కువగా తాగే వారిలో మైగ్రేన్ సమస్యలతో పాటు యూరినేషన్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. నిమ్మరసంలో ఉండే యాసిడ్స్ దంతాలపై ఉండే ఎనామిల్ కు హాని కలిగిస్తాయి. నిమ్మ రసం ఎక్కువగా తాగే వారిలో జుట్టు రాలే సమస్యలు పెరుగుతాయి. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ జుట్టును బలహీనంగా మార్చటంతో పాటు జుట్టు కణాలను దెబ్బ తీస్తుంది. నిమ్మరసం మితంగా తీసుకుంటే ఏ సమస్య లేదు కానీ ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు.