సముద్రపు ఉప్పు కన్నా ఈ ఉప్పు ఎంత మంచిదో తెలుసా..?
ఉప్పు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. నిత్యం మనం వంటకాల్లో వేసేది అయొడిన్ ఉప్పు. అంటే అందులో అయొడిన్ ఉంటుందన్నమాట. అలాగే సముద్రపు ఉప్పును కూడా కొందరు వాడుతారు. ఇక ఇవేకాకుండా మనకు హిమాలయ ఉప్పు కూడా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నది. హిమాలయ పర్వతాల్లో మాత్రమే దొరికే ఓ రకమైన, ప్రత్యేకమైన ఉప్పు ఇది. సాధారణ సముద్రపు ఉప్పు కన్నా ఎన్నో వందల రెట్లు క్వాలిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు, సముద్రపు ఉప్పు ఎక్కువగా వాడితే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి కదా, అయితే ఈ హిమాలయన్ ఉప్పు వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి.
హిమాలయన్ ఉప్పును నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే.. శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. తద్వారా ద్రవాలు నియంత్రణలో ఉంటాయి. శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఎండ దెబ్బ కొట్టేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ హిమాలయన్ సాల్ట్‌ను సాధారణ ఉప్పులా ఎక్కువ వాడాల్సిన పనిలేదు. సాధారణ ఉప్పును మనం ఒక టీస్పూన్ వాడే బదులు అందులో పావు వంతు హిమాలయన్ సాల్ట్‌ను వంటల్లో వాడితే చాలు. హిమాలయ ఉప్పులో సహజ సిద్ధమైన ఆల్కలైన్ గుణాలు ఉండడం వల్ల జీర్ణాశయంలో గ్యాస్, {{RelevantDataTitle}}