జీడిపప్పు తినటం వలన కలిగే ప్రయోజనాలివే...?
జీడిపప్పు తినటం వలన శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జీడిపప్పును భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కాజు అని పిలుస్తారు. స్వీట్ల తయారీలో జీడిపప్పును ఎక్కువగా వాడతారు. జీడిపప్పుతో శరీరానికి శక్తి లభిస్తుంది. జీడిపప్పు గుండెను పదిలంగా ఉంచటంతో పాటు శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. జీడిపప్పు శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంతో పాటు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.
పోషకాల లోపంతో వచ్చే వ్యాధులు రోజుకు గుప్పెడు జీడిపప్పు తీసుకుంటే దూరమవుతాయి. జీడిపప్పు రోజూ తినటం ద్వారా వృద్ధాప్య ఛాయలను, ముడతలను నివారించవచ్చు. జీడిపప్పులో పొటాషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, సెలేనియం, జింక్ లాంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు జీవక్రియలను వేగవంతం చేయటంతో పాటు బరువు తగ్గుదలకు సహాయం చేస్తుంది. జీడిపప్పు రోగ నిరోధక వ్యవస్థ బలపడటానికి సహాయపడుతుంది.
జీడిపప్పులో ఉండే ఒలీక్ యాసిడ్లు జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తాయి. జీడిపప్పు క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తుంది. కండరాలు బలంగా ఉండటానికి కూడా జీడిపప్పు ఉపయోగపడుతుంది. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడితే రోజూ జీడిపప్పు తింటే మంచి ఫలితాలు కలుగుతాయి. జీడిపప్పు అనీమియా, పెల్లాగ్రాలాంటి వ్యాధులు కలకుండా చూస్తుంది. రోజూ జీడిపప్పు తినేవారిలో మూత్ర పిండాలలో రాళ్లు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది.